ఎంఎస్ ధోని-నెహ్రా(ఫైల్‌ఫొటో)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఉత్తమ కెప్టెన్ ఎవరంటే సాధ్యమైనంతవరకూ ఎక్కువ శాతం ఎంఎస్ ధోని పేరునే చెబుతారు. చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు మూడు టైటిళ్లు(2010, 2011, 2018) సాధిండమే కాకుండా ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా రికార్డును సొంతం చేసుకుంది. ఇదే ధోనిని ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా నిలపడానికి దోహదం చేస్తోంది. కాగా, ఇటీవల ఐపీఎల్ ఉత్తమ కెప్టెన్ ఎవరంటే ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అని వ్యాఖ్యానించాడు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. నాలుగు ఐపీఎల్ టైటిల్స్‌ను సాధించిన రోహిత్ శర్మనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడన్నాడు. ఎక్కువ టైటిల్స్ సాధించే దాన్ని బట్టే ఉత్తమ కెప్టెన్లను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నాడు. (ధోనికి చాన్స్ ఇవ్వడం బాధించింది’)
కాగా, తాజాగా టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం ధోనికే ఓటేశాడు. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ కచ్చితంగా ధోనినే అంటూ పేర్కొన్నాడు. తాను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2014,15 సీజన్లలో ఆడాననే విషయం కూడా నెహ్రా గుర్తు చేసుకున్నాడు. నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మను పక్కనపెట్టి.. ధోనినే బెస్ట్ కెప్టెన్ అని నెహ్రా అన్నారు. అందుకు నెహ్రా ఒక కారణాన్ని కూడా చెప్పారు. తనకు ధోనితో ఆడి దగ్గర్నుంచి చూడటం వల్లే అతను ఉత్తమ కెప్టెన్ అని అన్నాడు. ఇక్కడ జాతీయ జట్టుకు అయినా, ఐపీఎల్‌కు అయినా ధోనినే తన ఉత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. ధోని కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడానని, దాంతో అతనే తన ఉత్తమ కెప్టెన్ అని పేర్కొన్నాడు. ఇక రోహిత్‌తో మ్యాచ్‌లు ఆడలేనందు వల్ల అతన్ని ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేనన్నాడు.
నెహ్రా చెప్పిన కారణం బాలేదు..
ఇక్కడ ధోని బెస్ట్ కెప్టెన్ అనేంతవరకూ బాగానే ఉంది. కానీ రోహిత్‌తో మ్యాచ్‌లు ఆడలేనందువల్ల అతన్ని ఉత్తమ కెప్టెన్ అనలేనని నెహ్రా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఒక విశ్లేషణ ఆధారంగానే ఎవరు ఉత్తమం అనే విషయాన్ని చెబుతాం. కానీ అతనితో పని చేయలేదు కాబట్టి ఉత్తమం కాదు అని చెప్పడం కాస్త వెటకారంగానే ఉంది. ప్రతీసారి సీఎస్‌కేను ప్లేఆఫ్స్‌కు చేర్చాడు కాబట్టి బెస్ట్ అని వదిలిస్తే నెహ్రాను ఎవరూ కాదనరు. కానీ ధోని కెప్టెన్సీలో ఆడా.. రోహిత్ కెప్టెన్సీలో ఆడలేదు కాబట్టి ఇక్కడ ఒక్కర్నే ఎంచుకుంటానంటే ఇక ప్రశ్న అడగడం వృథానే కదా..
Comments
Please login to add a commentAdd a comment