ముంబై: కశ్మీర్ విషయంలో ట్విట్టర్ ద్వారా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తాము ఏమి చేయాలో బయట వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదంటూ సచిన్ బదులిచ్చాడు.
బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశాన్ని నడిపించే సమర్థవంతమైన వ్యక్తులు మనకు ఉన్నారు. బయట వ్యక్తులు మనకు చెప్పడమేంటి. మేం ఏం చేయాలో బయట వ్యక్తులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని సచిన్ మండిపడ్డారు.
భారత భద్రతా దళాలు కశ్మీర్‌లో 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన తరవాత అఫ్రిది తన ట్వీట్‌కు పనిచెప్పాడు. కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, వారిపై తీవ్రంగా అణచివేత కొనసాగుతోందంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. యూఎన్, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీంతో మన క్రికెటర్లు అఫ్రిదిపై ఎదురుదాడికి దిగారు. కపిల్‌దేవ్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, జడేజా, గౌతం గంభీర్ తదితరులు ఇప్పటకే ఆఫ్రిదిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment