డ్రానా.. డ్రామానా! | Only test to be draw or high drama | Sakshi
Sakshi News home page

డ్రానా.. డ్రామానా!

Published Sun, Feb 12 2017 4:44 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

డ్రానా.. డ్రామానా! - Sakshi

డ్రానా.. డ్రామానా!

హైదరాబాద్: భారత్-బంగ్లాదేశ్ ల మధ్య జరగుతున్న ఏకైక టెస్టు డ్రానా.. డ్రామానా అన్నట్లు నడుస్తోంది. నాల్గోరోజు ఆటలో భాగంగా  రెండో ఇన్నింగ్స్ ను భారత్ 159/4 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 388 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 459 పరుగుల భారీ ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే ఓపెనర్లను పోగొట్టుకుని కష్టాల్లో కూరుకుంది.

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 103/3 వికెట్లు కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్ మన్లలో మహ్మదుల్లా(9), షకీబ్ అల్ హసన్(21) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్  రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజాకు ఒక వికెట్ దక్కింది.  కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 687/6 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement