
పటిష్టస్థితిలో ఆస్ట్రేలియా
టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.
బ్రిస్బేన్: టీమిండియా జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. టీమిండియా నిర్దేశించిన 309 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆసీస్ 37.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి పటిష్టస్థితికి చేరింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్), జార్జ్ బెయిలీ(17 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు అరోన్ ఫించ్(71), షాన్ మార్ష్(71)పెవిలియన్ కు చేరారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.