
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జార్జీ బెయిలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ కేవలం 3 విజయాలతో ఆరు పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లకు లీగ్ దశలో ఇది చివర్ మ్యాచ్ కాగా, ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకునేందుకు చెన్నై బరిలో దిగనుంది.