
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర్ పుజారా శతకాలపై శతకాలు బాదేస్తున్నాడు. ఆసీస్‌తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ సాధించాడు. ఇది పుజారా టెస్టు కెరీర్‌లో 18 వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం సాధించాడు. తొలి టెస్టులో శతకం సాధించిన పుజారా.. మూడో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీలు సాధించిన పుజారా.. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 199 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన పుజారా.. మరో 65 బంతుల్లో్ వంద పరుగుల మార్కును చేరాడు.
హాఫ్ సెంచరీని ఫోర్‌తోనే సాధించిన పుజారా.. ఫోర్‌తోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్ గావస్కర్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో పుజారా సెంచరీ సాధించడంతో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో్ 78 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 262 పరుగులు చేసింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(77) రాణించిన సంగతి తెలిసిందే. రాహుల్(9) తొలి వికెట్‌గా ఔట్ కాగా, మయాంక్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మూడో వికెట్‌గా కోహ్లి(28), నాల్గో వికెట్‌గా రహానే(18) ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment