
మలోర్కా (స్పెయిన్): స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఓ ఇంటివాడయ్యాడు. 14 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి జిస్కా పరెల్లోను నాదల్ పెళ్లి చేసుకున్నాడు. 300 మందికిపైగా అతిథులు ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం. నాదల్ సోదరి మరిబెల్‌కు జిస్కా చిన్ననాటి స్నేహితురాలు కావడం విశేషం. ప్రస్తుతం టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న 33 ఏళ్ల నాదల్... 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ (20)తో పోటీ పడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment