
మలోర్కా (స్పెయిన్): ఒకరికొకరు తన్మయత్వంలో ఊసులాడుకుంటున్న ఈ దృశ్యం చూస్తుంటే మనకూ ముచ్చటేస్తుంది. ప్రపంచ సూపర్ టెన్సీస్ స్టార్ రాఫెల్ నాదల్ (33), తన భార్య షిస్కా పరెల్లోతో పెళ్లినాడు దిగన రెండు ఫొటోలను విడుదల చేయగా అవి ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. నాదల్ గత 14 ఏళ్లుగా ప్రేమిస్తోన్న షిస్కా పరెల్లోను శనివారం నాడు మల్లోర్కాలోని అతి ఖరీదైన భవనంలో అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి ఓ కోట వద్ద వాళ్లు ఈ విధంగా దిగిన ఫొటోలను నాదల్ తన అభిమానుల కోసం షేర్ చేశారు. షిస్కా పరెల్లో ధరించిన పొడువాటి చేతుల గౌను పెళ్లి దుస్తుల్లాగే ఉంది. దాన్ని ప్రముఖ స్పానిష్ డిజైనర్ రోజల్ క్లారా డిజైన్ చేశారు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నాదల్)
Comments
Please login to add a commentAdd a comment