పిచ్‌ను కవర్లతో కప్పుతున్న దృశ్యం
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకింగా మారాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మోస్తరుగా వర్షమే కావడంతో మ్యాచ్ తిరిగి ఆరంభం కావడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
ఆసీస్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యువ భారత్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. ఓపెనర్లు పృథ్వీ షా(10 బ్యాటింగ్), మన్‌జోత్ కర్లా(9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్ మావి ఓ వికెట్ తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment