కేప్‌టౌన్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం ఆటంకంగా మారింది. ఆదివారం కేప్‌టౌన్‌లో భారీ వర్షం పడటంతో మూడో రోజు ఆట నిర్వహించడం సాధ్యపడలేదు. పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో ఈ రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత మ్యాచ్ ఆరంభ సమయంలో భారీ వర్షం పడింది. ఆపై కాసేపు వర్షం ఆగినప్పటికీ మరొకసారి పడింది. దాంతో మ్యాచ్ జరిగే అవకాశం లేకపోడంతో మూడో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే వర్షార్పణం అయ్యింది. కేప్‌టౌన్‌లోని మ్యాచ్ జరిగే న్యూలాండ్స్ స్టేడియానికి సంబంధించి డ్రైనేజ్ వసతులు మెరుగ్గా ఉన్నప్పటికీ పదే పదే వర్షం కురువడంతో చేసేది ఏమీ లేకపోయింది.
శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్), నైట్‌వాచ్‌మన్ రబడ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా సఫారీ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment