రవిశాస్త్రికే అవకాశాలు ఎక్కువ!
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు తన మాజీ సహచరుడు రవిశాస్త్రికే ఎక్కువగా ఉన్నాయని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. గతంలో టీమ్ డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో శాస్త్రి పనితీరు కోచ్ పదవికి అదనపు అర్హత అని ఆయన అన్నారు. ‘2014లో భారత జట్టు ఇంగ్లండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత టీమ్ డైరెక్టర్‌గా శాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. అతని రాకతో ఒక్కసారిగా జట్టు రాత కూడా మారింది.
అది జట్టుకు కీలక మలుపు. అతను ఇప్పుడు అధికారికంగా దరఖాస్తు చేశాడు కాబట్టి కచ్చితంగా శాస్త్రినే ఎంపిక కావచ్చు’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు. కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్, టామ్ మూడీ, సిమన్స్, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్, వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు.