
కొలంబో: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్‌లో డకౌట్‌గా నిష్ర్రమించగా, రెండో ఓవర్‌లో సురేశ్ రైనా(1) పెవిలియన్ చేరాడు. దాంతో భారత జట్టు 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.దాంతో టీమిండియా బ్యాటింగ్‌ను రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఆరంభించారు. శ్రీలంక పేసర్ చమీరా వేసిన తొలి ఓవర్ నాల్గో బంతికి రోహిత్ శర్మ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. జీవన్ మెండిస్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో రోహిత్ పెవిలియన్ చేరాడు. ఆపై నువాన్ ప్రదీప్ వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి రైనా బౌల్డ్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment