కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది.
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ జట్టు తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది. రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర జట్టు తో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 91 ఓవర్లలో 3 వికెట్లకు 284 పరుగులు చేసింది. జి. వి. వినీత్ రెడ్డి (273 బంతుల్లో 124 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చందన్ సహాని (58), పి. సాయి వికాస్ రెడ్డి (61) అర్ధసెంచరీలు చేయగా... షేక్ సొహాలి (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.