పతకం నిలబెట్టుకుంటా | saina nehwal will win medal in common wealth games | Sakshi
Sakshi News home page

పతకం నిలబెట్టుకుంటా

Published Thu, Jul 17 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

పతకం నిలబెట్టుకుంటా

పతకం నిలబెట్టుకుంటా

కామన్వెల్త్ గేమ్స్‌పై సైనా
 బంజారాహిల్స్: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం నిలబెట్టుకుంటానని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తెలిపింది. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) బ్రాండ్ అంబాసిడర్ అయిన ఆమె తన కెరీర్ ఫొటోలతో కూడిన ఫొటోబుక్‌ను ఆ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్రతో కలిసి ఆవిష్కరించింది. నగరంలోని ఓ హోటల్‌లో బుధవారం జరిగిన ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ త్వరలో గ్లాస్గో (స్కాట్లాండ్)లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మెరుగైన ర్యాంకుకు చేరుకుంటానని చెప్పింది. ప్రస్తుతం ఈ హైదరాబాదీ స్టార్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది.
 
 ఐఓబీ చైర్మన్ నరేంద్ర మాట్లాడుతూ తమ బ్యాంక్‌కు  ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సైనా కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో తమ బ్యాంక్ ఏడో స్థానంలో కొనసాగుతుండగా సైనా కూడా ఏడో ర్యాంక్‌లోనే ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అయితే త్వరలో ఆమె టాప్ ర్యాంకుకు చేరుకోవాలన్నారు. విద్య, సాంస్కృతిక, క్రీడల్లో  రాణించిన వారికి తమ బ్యాంక్ ప్రోత్సాహాకాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, సైనా తల్లిదండ్రులు ఉష, హర్‌వీర్‌సింగ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement