
అబుదాబి:ఇటీవల యూఏఈ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను గెలవడానికి క్షుద్రపూజలే కారణమని శ్రీలంక కెప్టెన్ చండీమాల్ వ్యాఖ్యలపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మండిపడ్డాడ్డు. తమ పేలవమైన బ్యాటింగ్ కారణంగానే లంకేయులతో జరిగిన టెస్టు సిరీస్ ను ఓడిపోయామని, అంతేతప్పా ఇక్కడ క్షుద్రపూజలకు అవకాశమే లేదంటూ విమర్శించాడు. ఒకవేళ లంకేయులు క్షుద్రపూజల కారణంగా టెస్టు సిరీస్ ను గెలిస్తే, ఆ తరువాత జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు ఓడిపోయారంటూ చండీమాల్ కు ప్రశ్నలు కురిపించాడు.
'మేము క్షుద్రపూజల వల్ల టెస్టు సిరీస్ ను ఓడిపోలేదు. మా ఓటమికి మేము సరిగా ఆడకపోవడమే. ఎవరో మంత్రగాళ్ల వల్ల మాపై లంక టెస్టు సిరీస్ ను గెలిస్తే.. మరి వన్డే, టీ 20 సిరీస్ లో వారు ఎందుకు చిత్తుగా ఓడిపోయారు' అని సర్ఫరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తరహా విధానాలకు క్రికెట్ కు ముడిపెట్టడం సరికాదని పాకిస్తాన్ మాజీ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ విమర్శించాడు. ఇలా అయితే ఇక క్రికెట్ మ్యాచ్ ల్లో విజయాల్ని క్షుద్రపూజలే నిర్ణయిస్తామో అంటూ చురకలంటించాడు.
Comments
Please login to add a commentAdd a comment