సెరెనా వర్సెస్ ప్లిస్కోవా
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అమెరికా స్టార్ క్రీడాకారిణి, నల్లకలువ సెమీస్కు చేరింది. మహిళల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సెరెనా 6-2, 4-6, 6-3 తేడాతో సిమోనా హాలెప్(రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్కు చేరింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. రెండో సెట్ను కోల్సోయింది. ప్రత్యేకంగా రెండో సెట్లో హాలెప్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే సెరెనా డజనకు పైగా బ్రేక్ పాయింట్లను చేజార్చుకుని ఆ సెట్ను హాలెప్కు అప్పగించింది. ఈ టోర్నీలో సెరెనా సెట్ను కోల్పోవడం ఇదే తొలిసారి.
అయితే నిర్ణయాత్మక మూడో సెట్లో సెరెనా పూర్తి నియంత్రణతో ఆడింది. ఈ సెట్ లో తొలుత 3-1 ఆధిక్యంలోకి వెళ్లిన సెరెనా వరుసగా పాయింట్లు సాధిస్తూ హాలెప్ను ఒత్తిడిలోకి నెట్టి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)తో సెరెనా తలపడనుంది. గతేడాది యూఎస్ ఓపెన్ ను కోల్పోవడంతో క్యాలెండర్ స్లామ్ను సాధించే అవకాశాన్ని సెరెనా చేజార్చుకుంది. ఇప్పటివరకూ ఆరు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ను గెలిచిన సెరెనా మరో టైటిల్ పై కన్నేసింది. ఇప్పటివరకూ 22 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన సెరెనా.. యూఎస్ ఓపెన్ ను గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్లు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.