లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాడిపై లైంగింక ఆరోపణల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తనతో శృంగారంలో పాల్గొన్న సదరు ‘ప్రీమియర్ లీగ్ స్టార్ ప్లేయర్.. ఆపై డబ్బుతో తన నోరు మూయించేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపణలకు దిగారు. విషయంలోకి వెళ్తే.. క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్(34) అనే మార్కెటింగ్ మేనేజర్ ఈ మధ్య ఓ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు. ఆ పార్టీకి ఓ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ తన భార్యతోపాటు హాజరయ్యాడు. మ్యూచ్‌వల్ ఫ్రెండ్ ద్వారా మిలాకు.. ఆ ఆటగాడి మధ్య మాటలు కలిశాయి. అలా కొన్ని గంటలు గడిచాక ఇద్దరి మనసులు కలిశాయి. ఈ క్రమంలో ఆమెకు అతగాడు సెక్స్ ప్రపోజ్ చేయగా.. ఆమె ఒప్పుకున్నారు. అయితే ఉదయం సదరు ఆటగాడి భార్య ఫోన్ చేయటంతో.. అతను సింగిల్ కాదనే విషయం మిలాకు అర్థమైంది. ఈ విషయంపై అతన్ని నిలదీయగా పరువు పోతుందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చిన మిలా బొన్నెట్.. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.‘వివాహం కాలేదని అబద్ధం చెప్పాడు. భార్య పక్క రూమ్‌లో ఉండగానే నాతో ఏకాంతంగా గడిపాడు. తప్పు చేసిందేకాక ఓ స్నేహితుడ్ని పంపి రెండు వేల పౌండ్లు చెల్లిస్తానని.. విషయం బయటకు చెప్పొద్దని రాయబారం నడిపాడు. అలాంటి అబద్ధాలకోరుకి శిక్ష పడాలి. అతని భార్యకు, ఈ ప్రపంచానికి అతని నిజస్వరూపం తెలియాలి’ అని మిలా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఆమె సదరు పుట్‌బాల్ ఆటగాడి పేరు బయటపెట్టినప్పటికీ.. న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో సదరు ఛానెల్ ఆ పేరును గోప్యంగా ఉంచింది. మరోవైపు తన అటార్నీ ద్వారా ఈ విషయాన్ని సైలెంట్ చేసేందుకు సదరు ప్లేయర్ ప్రయత్నిస్తున్నట్లు ది సన్ ఓ కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment