టి20 ప్రపంచకప్ అనంతరం షాహిద్ ఆఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తొలగించడం ఖాయమైంది.
కరాచీ: టి20 ప్రపంచకప్ అనంతరం షాహిద్ ఆఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తొలగించడం ఖాయమైంది. ఈవిషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టతనిచ్చారు. ‘ప్రపంచకప్ వరకు ఆఫ్రిది కెప్టెన్‌గా ఉంటాడు. మా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ టోర్నీ అనంతరం రిటైర్ అవుతానని చెప్పాడు.
ఒకవేళ మనసు మార్చుకుని ఆడాలనుకున్నా కెప్టెన్‌గా మాత్రం కొనసాగడు. అలాగే ఆటగాడిగా కూడా జట్టులో ఉంటాడా? లేదా? అనేది కూడా చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో తనకు అందరి మద్దతు అవసరం’ అని ఖాన్ అన్నారు. భారత్‌లో తమ జట్టుకు ఏర్పాటు చేసిన భద్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.