
వింబుల్డన్ సెమీస్ లో షరపోవా
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నాలుగో సీడ్ క్రీడాకారిణి మారియా షరపోవా సెమీ ఫైనల్ కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో షరపోవా 6-3, 6-7, 6-2 తేడాతో వాందివెగీపై విజయం సాధించి సెమీస్ లో కి ప్రవేశించింది.
తొలి సెట్ ను అవలీలగా గెలిచిన షరపోవా.. రెండో గేమ్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో షరపోవా దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ సెట్ ను కైవశం చేసుకుని టోర్నీలో మరో ముందడుగు వేసింది.