బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ఆఫ్ స్పిన్నర్ శివలాల్ యాదవ్ ఎన్నికయ్యే అవకాశముంది.
చెన్నై: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ఆఫ్ స్పిన్నర్ శివలాల్ యాదవ్ ఎన్నికయ్యే అవకాశముంది. జరగబోయే వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు శ్రీనివాసన్ స్థానంలో యాదవ్ను ఎన్నిక కావచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.
శివలాల్ యాదవ్ తరపున శ్రీనివాసన్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధులతో ఈ మేరకు సంప్రదింపులు జరిపారు.