కేప్‌టౌన్: త్వరలో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడటానికి సఫారీలు ఆ దేశ పర్యటనకు వెళ్లాలి. అయితే వర్క్‌లోడ్ ఎక్కువ ఉన్న కారణంగా దానికి తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటిల్ జాక్వస్ ఫాల్ తెలిపారు. ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ ఎప్పుడు జరిగేది తర్వాత వెల్లడిస్తామన్నారు. ఇందుకు పీసీబీ కూడా ఒప్పుకోవడంతో ఎప్పుడు వచ్చేది త్వరలోనే స్పష్టం చేస్తామన్నారు. తమ అంతర్జాతీయ షెడ్యూల్‌లో పాక్ పర్యటన ఉందని, దాన్ని సాధ్యమైనంత త్వరలోనే నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లపై పని భారం అధికం అయిన కారణంగా పాక్ పర్యటన వాయిదా వేయక తప్పలేదన్నారు. (ఇక్కడ చదవండి: ఇది కదా అసలైన ప్రతీకారం)
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ముగించిన ఈ జట్టు తాజాగా అదే జట్టుతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. ఈనెల 16న ఇది ముగిశాక ఆసీస్‌తో తిరిగి మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. వారం వ్యవధిలోనే మూడు వన్డేల సిరీస్ కోసం సఫారీలు భారత్‌కు రానున్నారు. ఆ తర్వాత వెంటనే మూడు టీ20ల కోసం పాక్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్ కారణంగా క్రికెటర్లు తీవ్రంగా అలసిపోతారనే ఉద్దేశంతో ప్రస్తుతానికి పాక్ టూర్‌కు వెళ్లకపోవడమే మంచిదని సీఎస్‌ఏ ఈ నిర్ణయం తీసుకుంది. (ఇక‍్కడ చదవండి: పరుగు తేడాతో గెలుపు.. స్టెయిన్ రికార్డు)
Comments
Please login to add a commentAdd a comment