సెంచూరియన్: పేసర్ల ప్రతాపంతో దక్షిణాఫ్రికా–పాకిస్తాన్‌ల తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీల ఎదుట 148 పరుగుల లక్ష్యం నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 127/5తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 223 పరుగులకు ఆలౌటైంది. బవుమా (53), డికాక్ (45) రాణిం చారు. దీంతో ఆ జట్టుకు 42 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం ఒలివియర్ (5/59) మరోసారి దెబ్బకొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 190 పరుగులకే ఆలౌటైంది. ఇమాముల్ హక్ (57), షాన్ మసూద్ (65) అర్ధ శతకాలు చేశారు. ఒలివియర్ ఈ మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు పాక్ పేసర్లు ఆమిర్, షాహిన్ షా ఆఫ్రిదిలను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికాకూ సవాలే.
Comments
Please login to add a commentAdd a comment