జక్కా వైష్ణవి రెడ్డి
సాక్షి, హైదరాబాద్: స్పానిష్ ఓపెన్ జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి చాంపియన్‌గా అవతరించింది. స్పెయిన్‌లోని ఒవియెడో నగరంలో జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ వైష్ణవి 21–9, 21–10తో మరియన్ లె టుర్డు (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో 16 ఏళ్ల వైష్ణవి తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన వైష్ణవి రెండో రౌండ్‌లో 21–9, 21–12తో లారా విలాకోర్టా (స్పెయిన్)పై, మూడో రౌండ్‌లో 21–9, 21–19తో రొమేన్ క్లోటెక్స్ (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 21–10, 21–8తో మడుక్ లిండెర్స్ (నెదర్లాండ్స్)పై, సెమీఫైనల్లో 21–19, 21–5తో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రూహీ రాజుపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment