స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత హాప్ మన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు.
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 15 ఏళ్ల తర్వాత హాప్ మన్ కప్ టోర్నీలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని కప్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది పెర్త్లో నిర్వహించనున్న ఈ టోర్నీలోవరల్డ్ నం.3 ఆటగాడు ఫెదరర్కు జోడీగా బెలిండా బిన్సిక్ బరిలో దిగుతాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్స్లామ్ కు కొన్నిరోజుల ముందు వార్మప్ టోర్నీగా హాప్ మన్ కప్ నిర్వహించనున్నారు.
ఫెదరర్ చివరగా 2001లో మార్టినా హింగిస్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ నెగ్గాడు. ఆ తర్వాతి ఏడాది తన భార్య మిర్కా ఫెదరర్తో స్విస్ స్టార్ జతకట్టాడు. 2002 తర్వాత ఈ టోర్నీలో ఫెదరర్ పాల్గొనలేదు. సీజన్ స్టార్ట్ చేయడానికి అదే సరైన సమయమని ఫెదరర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రియోకు సన్నద్ధమవుతున్న స్విస్ స్టార్ కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టోర్నీ నుంచి వైదొలిగినట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.