సాక్షి, న్యూఢిల్లీ: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మెన్ అవుట్ విషయంలో అంపైర్లు తడబడటం చూశాం.. కానీ ఏకంగా థర్డ్ అంపైర్ అయోమయానికి గురైన ఘటన రోహిత్ శర్మ అవుట్ విషయంలో జరిగింది. బోల్ట్ వేసిన 19 ఓవర్ చివరి బంతిని షాట్ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగిలి తగలనట్లు.. రాసుకుంటు వెళ్లి కీపర్ చేతిలో పడింది. అయితే కీపర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అవుట్ విషయంలో అంపైర్లు సందిగ్ధం వ్యక్తం చేశారు.
కానీ బౌలర్ బోల్ట్.. కెప్టెన్ విలియమ్సన్ అప్పీల్ చేయడం.. రివ్యూకోసం సిద్దంగా ఉండటంతో అంపైర్లు మరోసారి తమనిర్ణయాన్ని ధర్డ్ అంపైర్‌తో సమీక్షించుకున్నారు. అయితే ధర్డ్ అంపైర్ అనిల్ చౌదరి అత్యుత్సాహంతో కేవలం బ్యాట్ బంతికి తగిలిందా.. లేక గ్రౌండ్‌కు తగిలిందా అనే విషయాన్ని మాత్రమే గుర్తించి నాటౌట్ ఇచ్చాడు. అయితే ఓ వైపు న్యూజిలాండ్ డ్రెస్సింగ్ వైపు నుంచి కివీస్ ప్లేయర్లు అవుట్ అనే విషయాన్ని తెలియజేయడంతో విలియమ్సన్ మరో సారి రివ్యూ కోరాడు. దీంతో ఇంకోసారి పరిశీలించిన ధర్డ్ అంపైర్ బంతి బ్యాట్‌కు అల్ట్రా ఎడ్జ్ అయిందని గుర్తించి అవుట్ ఇచ్చాడు. దీంతో మైదానంలో ఉన్న రోహిత్(80) ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ క్రీజు వదిలాడు. ఈ పద్దతి ఏమిటో అర్థం కాక క్రికెట్ అభిమానులు తల పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment