ముంబై:శ్రీలంకతో మూడో టీ 20లోనూ టీమిండియా బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్ సేన.. ఆదిలోనే లంకకు చుక్కలు చూపెడుతోంది. 18 పరుగులకే మూడు శ్రీలంక కీలక వికెట్లు తీసి పైచేయి సాధించింది. లంక 8 పరుగుల వద్ద డిక్వెల్లా(1) అవుట్ కాగా, 14 పరుగుల వద్ద కుశాల్ పెరీరా(4) అవుటయ్యాడు. అటు తరువాత ఉపుల్ తరంగా(11) పెవిలియన్‌కు చేరాడు. దాంతో శ్రీలంక ఒక్కసారిగా కష్టాల్లో పడింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆకట్టుకోవాలని భావించిన లంకేయులకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలడంతో వారి శిబిరంలో నిరాశ అలుముకుంది.
శ్రీలంక ఇన్నింగ్స్ ను డిక్విల్లా, తరంగాలు నెమ్మదిగా ఆరంభించారు. కాగా, ఉనాద్కత్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి డిక్విల్లా భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆపై మూడో ఓవర్ ఆఖరి బంతికి కుశాల్ పెరీరాను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. ఇక్కడ సుందర్ రిటర్న్‌క్యాచ్ పట్టడంతో పెరీరా పెవిలియన్ బాట పట్టాడు. ఇక నాల్గో ఓవర్‌లో తరంగా అవుటయ్యాడు. ఉనాద్కత్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి తరంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. సమరవిక్రమ(21) నాల్గో వికెట్‌గా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆపై గుణతిలకా(3), తిషారీ పెరీరా(11)లు స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. దాంతో 13 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment