‘ఎ’ జట్ల కెప్టెన్లుగా రాయుడు, ఉన్ముక్త్
చెన్నై: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టుకు తెలుగుతేజం అంబటి తిరుపతి రాయుడు సారథ్యం వహించనున్నాడు. ఈనెల 18 నుంచి చెన్నైలో ఈ సిరీస్ జరుగుతుంది. అలాగే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఎ జట్లు పాల్గొంటున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్ ఉన్ముక్త్ చంద్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈనెల 5 నుంచి ఈ సిరీస్ జరుగుతుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది.
ముక్కోణపు సిరీస్‌కు భారత్ ‘ఎ’ జట్టు: ఉన్ముక్త్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, అక్షర్ పటేల్, పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, ధావల్ కులకర్ణి, సందీప్ శర్మ, రుష కలారియా, మన్‌దీప్ సింగ్, గురుకీరత్ సింగ్, రిషి ధావన్.టెస్టు సిరీస్‌కు ‘ఎ’ జట్టు: రాయుడు (కెప్టెన్), కరుణ్ నాయర్, ముకుంద్, అంకుష్, శ్రేయస్ అయ్యర్, అపరాజిత్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, కరణ్ శర్మ, అభిమన్యు మిథున్, శార్దూల్ ఠాకూర్, ఈశ్వ ర్ పాండే, షెల్డన్ జాక్సన్, జీవన్‌జ్యోత్ సింగ్.