
ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను విదిత్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
ప్రస్తుతం విదిత్ 5.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు క్రామ్నిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో హారిక 53 ఎత్తులో ఓడిపోయింది.