
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీ జరిమానా పడింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన కోహ్లికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా ఓవర్‌రేట్ నిబంధనలను ఉల్లఘించిన కోహ్లికి భారీ జరిమానా విధించినట్లు ఐపీఎల్ యాజమాన్యం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
‘స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆర్సీబీ జట్టు కెప్టెన్ కోహ్లికి 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి` అని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఓ లేఖలో పేర్కొంది. కాగా, ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, దాన్ని కాపాడుకోవడంలో కోహ్లి అండ్ గ్యాంగ్ విఫలమైంది. చెన్నై ఆటగాళ్లు ఎంఎస్ ధోని, అంబటి రాయుడుల జోరుతో బెంగళూరు ఓటమి పాలైంది.