
సిడ్నీ: క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓవర్ ముగిసిన వెంటనే బంతిని అంపైర్‌కు ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆటలో ఎటువంటి బ్రేక్ వచ్చినా బంతిని తన వద్దనే పెట్టుకుంటారు ఫీల్డ్ అంపైర్లు. ఇలా చేయడం వల్ల ట్యాంపరింగ్‌ను సాధ్యమైనంత వరకూ నివారించవచ్చనేది ఐసీసీ ఉద్దేశం, రూల్ కూడా. ఒకవేళ బంతి ఆకారంలో ఏమైనా తేడా కనిపిస్తే దాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లడం వరకూ మాత్రమే ఆటగాళ్లు చేసే పని. అప్పుడు ఆ బంతిని చెక్ చేసి ఏం చేయాలనేది ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
అలా కాకుండా ఆట విరామంలో బంతితో ఆడుకోవడమనేది రూల్స్ ప‍్రకారం తప్పే. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విరామ సమయంలో బంతితో ఆడుకోవడమనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆసీస్‌తో నాల్గో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీ బ్రేక్‌లో అంపైర్ వద్ద నుంచి బంతిని తీసుకున్న కోహ్లి దాన్ని బంతితో టచ్ కొట్టాడు. ఆటను తిరిగి ఆరంభించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్ల కోసం నిరీక్షించే సమయంలో బంతిని అంపైర్ నుంచి తీసుకున్న కోహ్లి.. బంతిని బ్యాట్‌కు మిడిల్ చేస్తూ పరీక్షించబోయాడు. బంతిని చూస్తానని చెప్పి కోహ్లి ఇలా చేయడంతో అంపైర్ రిచర్డ్ కెటెల్‌బోరో ఆశ‍్చర్యానికి గురయ్యాడు. అలా చేయవద్దంటూ కోహ్లి నుంచి బంతిని బలవంతంగా తీసేసుకున్నాడు. ఇక్కడ కోహ్లి చేసింది బ‍్యాట్ స్ట్రోక్‌ను చెక్ చేయడానికే అయినా, బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లి ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment