నోట్ల రద్దు ఎఫెక్ట్.. సెహ్వాగ్ మనీ రిక్వెస్ట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ టెస్టులో బంతితోనే కాదు బ్యాట్‌తోనూ ప్రత్యర్థి జట్టుకు తన సత్తా చూపించిన ఆటగాడు రవీంద్ర జడేజా. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ జడేజా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. స్పాన్సర్ పేటీఎం వారు అతడి పేటీఎం ఖాతాకు లక్ష రూపాయల నగదును బదిలీ చేశారు.
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పై స్పందించాడు. జడ్డూ బాయ్.. జనాల వద్ద కనీసం రూ.2 వేల నోటు కూడా అందుబాటులో ఉండటం లేదు. నువ్వు మాత్రం ఏకంగా లక్ష రూపాయాలను పేటీఎం నుంచి సాధించావు. కొంత మొత్తం మనీని తన పేటీఎం అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ అందరినీ చాలా ఆకట్టుకుంది. అప్పటినుంచీ ఈ ట్వీట్ విపరీతంగా షేర్ అవుతోంది. నోట్ల రద్దుపై ప్రస్తుత పరిస్థితులను ప్రతిబించించేలా సెహ్వాగ్ ఈ ట్వీట్ చేశాడా.. లేక జడేజాను ఆట పట్టించడానికి ట్వీట్ చేశాడా అని సోషల్ మీడియాలో రీట్వీట్స్ చేస్తున్నారు.
Wah Jaddu Bhai ! Hamare paas toh 2000 ke chhutte nahi hai aur aap @Paytm mein 1 Lakh le gaye. Thoda hamare Paytm mein bhi transfer kijiye