మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌లో చాంపియన్ ట్రోఫీ ఫలితాన్ని రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సూచించాడు. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరగనుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సందర్భంగా వకార్ యూనిస్ మీడియాతో మాట్లాడాడు. పాక్ ఈ మెగా టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఏ ప్లస్ ప్రదర్శన చేయాలన్నాడు. ముఖ్యంగా ఆరంభంలో వికెట్లు చేజార్చుకోకూడదని పేర్కొన్నాడు. వికెట్లు చేజార్చుకుంటే భారీ స్కోర్ సాధించలేమని.. ఇక ఛేదనలో అయితే జట్టుపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపాడు.
మాలిక్ ఎందుకు?
టీమిండియాతో మ్యాచ్‌కు ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని వకర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదో బౌలర్ ముఖ్యంగా స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు హఫీజ్, మాలిక్‌లు స్పిన్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయారన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రాయ్, రూట్ వికెట్లను తీసని షాదాబ్ ఖాన్‌ను టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌కు తీసుకోవాలన్నాడు. అవసరమైతే మాలిక్‌ను పక్కకు పెట్టాలన్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న మాలిక్ జట్టులో ఎందుకు అని వకార్ ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment