'ఆ రకంగా తప్పుకుంటే నన్ను విలన్ను చేస్తారు' | Waqar Younis refuses to quit, says won't go out as villain | Sakshi
Sakshi News home page

'ఆ రకంగా తప్పుకుంటే నన్ను విలన్ను చేస్తారు'

Published Sun, Apr 3 2016 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

'ఆ రకంగా తప్పుకుంటే నన్ను విలన్ను చేస్తారు'

'ఆ రకంగా తప్పుకుంటే నన్ను విలన్ను చేస్తారు'

కరాచీ: . వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనకు, తన కోచ్ పదవికి ఎటువంటి సంబంధం లేదని వకార్ యూనస్ స్పష్టం చేశాడు.  ఈ నేపథ్యంలో తాను స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి బయటకు రావాలనుకోవడం లేదన్నాడు. ఒకవేళ తాను ఇలా ముందుగానే వైదొలిగితే  అందరి దృష్టిలో విలన్ అవడం ఖాయమన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి తనకు ఎటువంటి సమస్యలూ లేనప్పుడు ఎందుకు బయటకు రావాలని ప్రశ్నించాడు.

 

' పాకిస్తాన్ జట్టు వరుస ఓటములకు నేను ఎంతమాత్రం బాధ్యుణ్ని కాను. పాక్ జట్టుకు నేను చేయాల్సింది చేశాను. నేను కోచింగ్ జాబ్ కోసం పీసీబీ అభ్యర్ధించలేదు. కేవలం అప్లై చేసిన తరువాతే ఈ పదవి చేపట్టా. ఒకవేళ నన్ను బోర్డు  కోచ్ వైదొలగాలని కోరితే, ముందుగా వారు రాత పూర్వకంగా నాకు తెలియజేయాలి.  అసలు బోర్డు నుంచి అటువంటిది లేనప్పుడు ఎలా తప్పుకుంటా. ఆ రకంగా ముందుగానే తప్పుకుంటే నన్ను విలన్ను చేస్తారు. అది నాకిష్టం లేదు' అని వకార్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement