సానియామీర్జాను ఎందుకు పక్కనబెట్టారు? | WHY WAS SANIA MIRZA DUMPED? | Sakshi
Sakshi News home page

సానియామీర్జాను ఎందుకు పక్కనబెట్టారు?

Published Wed, Dec 2 2015 8:21 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

సానియామీర్జాను ఎందుకు పక్కనబెట్టారు? - Sakshi

సానియామీర్జాను ఎందుకు పక్కనబెట్టారు?

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వార్షిక క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి భారత్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను ఆహ్వానించాలని మొదట భావించారు. అయితే ఆమెను అర్ధంతరంగా పక్కనబెట్టి పుల్లెల గోపీచంద్‌కు ఈ అవకాశం కల్పించారు. ఈ వేడుకకు సానియాను ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని మానుకోవడానికి కారణం ఆమె పెట్టిన డిమాండ్లేనట. ఈ వేడుకకు హాజరయ్యేందుకు బోఫాల్ వరకు చార్టర్‌ జెట్‌ విమానం సమకూర్చాలని, తన మేకప్‌ కిట్‌ కోసం రూ. 75వేలు ఇవ్వాలని, అప్పుడే క్రీడాపురస్కారాల ప్రదానోత్సవానికి వస్తానని సానియా డిమాండ్ చేసిందట. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ క్రీడాశాఖ మంత్రి యశోధరారాజే సింథియా తెలిపారు. వాస్తవానికి ఈ క్రీడా వేడుకు శనివారం జరుగాల్సి ఉంది. సానియా రాకపోవడంతో మంగళవారమే నిర్వహించారు.

ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న క్రీడాకారులకు మంత్రి యశోధర విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సానియాను ఆహ్వానించాలని తాను అనుకున్నట్టు ఆమె చెప్పారు. సానియా కూడా ఈ ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించిందని, అయితే ఆమె పర్సనల్ అసిస్టెంట్‌ మాత్రం సానియా వచ్చేందుకు డిమాండ్లు చేశాడని తెలుస్తున్నది. దీంతో బాడ్మింటన్‌ స్టార్‌ పుల్లెల గోపీచంద్‌ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వివాదంపై స్పందించడానికి సానియా అందుబాటులో లేరు. ఈ విషయమై మధ్యప్రదేశ్ మంత్రి యశోధర మాట్లాడుతూ టెన్నిస్ స్టార్‌గా సానియామీర్జా పట్ల తనకు గౌరవముందని, అయితే ఆమె డిమాండ్లను క్రీడామంత్రిత్వశాఖ ఆమోదించలేదని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement