కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫెడరర్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సిన నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో ఫెడరర్‌కు వాకోవర్ లభించింది. సెమీఫైనల్లో జాక్ సాక్ (అమెరికా)తో ఫెడరర్ తలపడతాడు.