
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన అభిమాన నటిని కలుసుకున్నారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన అభిమాన నటిని కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ నటి మరెవరో కాదు. బాలీవుడ్ నటి కాజోల్. బాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ మూవీల్లో కాజోల్ నటించారు. ఆపై నటుడు అజయ్ దేవగణ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
విమానం ఆలస్యమయితే కాస్త చికాకు ఉండటం సహజమే. కానీ ఈ కారణంగా నా అభిమాన నటి కాజోల్‌ను కలుసుకోగలిగానని పోస్ట్ ద్వారా యువీ హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో ఆమెను కలిసిన సందర్భంగా సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ సెలబ్రిటీల అభిమానులు లైక్స్, షేర్లతో చెలరేగుతున్నారు. ఇద్దరు దిగ్గజాలు ఒకేఫ్రేములో ఉంటే ఇలా ఉంటుందంటూ కామెంట్ చేస్తున్నారు. కాజోల్ వీఐపీ-2 ప్రాజెక్టుతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వగా, టీమిండియాలో చోటుదక్కని యువీ దేశవాలీ టోర్నీలలో పాల్గొంటున్నారు.