8.35 లక్షల రేషన్‌కార్డులు రద్దు
రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్ అమలు
హమాలీలకు పీఎఫ్, బీమా సదుపాయం మంత్రి దినేష్ గుండూరావ్
బెంగళూరు: రాష్ట్రంలో అన్నభాగ్య పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8.35 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ తెలిపారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల నుంచి ప్రతి చౌకధరల దుకాణంలో అర్హుల పేర్లను బహిరంగ పరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పేర్లలో ఇంకా అనర్హులు ఉన్నట్లు భావిస్తే ఎవరైనా పౌరసరఫరాల శాఖలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్‌షాపుల్లో ఆహార ధాన్యాలతోపాటు కిరోసిన్‌ను కూడా అందజేస్తామన్నారు. ప్రస్తుతం వీటిని వేర్వేరు తేదీల్లో అందజేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రానికి కేటాయించే కిరోసిన్ పరిమాణంలో 6.3 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు.
అందువల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లీటర్ల స్థానంలో నాలుగు లీటర్లను అందజేస్తామని చెప్పారు. నగర ప్రదేశాల్లో లబ్ధిదారులకు ఇస్తున్న కిరోసిన్ పరిమాణంలో ఎటువంటి మార్పు లేదన్నారు. వచ్చే నెల నుంచి ‘ఆధార్’తోపాటు ఓటర్ కార్డు నంబర్‌ను రేషన్ షాపులో అం దించే వీలు కల్పిస్తున్నామన్నారు. రేషన్ సరుకుల రవాణా వాహనాలకు ఈ నెల నుంచే ‘జీపీఎస్’ (గ్లోబ ల్ పొజిషనింగ్ సిస్టం)ను అమలు చేయనున్నామని తెలిపారు. దీని వల్ల స్టాక్‌పాయింట్ల నుంచి తా లూకా కేంద్రాలకు సరుకు రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలను నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖలో హమాలీలకు పీఎఫ్, బీమా సదుపాయాలు కూడా కల్పించనున్నామని చెప్పారు.