ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందా?
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు జంగ్ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం గవర్నర్ జంగ్‌ను కలిసిన విషయం తెలిసిందే. మైనారిటీ సర్కార్‌ను ఏర్పాటు చేసేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరిన నేపథ్యంలో విలేకరులు జంగ్‌ను ప్రశ్నించగా ఈ పరిస్థితుల్లో తానేమీ చెప్పలేనన్నారు.