సాక్షి ప్రతినిధి, బెంగళూరు :
రాష్ట్రంలో ఉల్లి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ గగన మార్గం పడుతున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.55 దాకా పలుకుతుండగా, చిల్లర మార్కెట్‌లో సైజును బట్టి రూ.65 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు. దీపావళి నాటికి టపాకాయలు బదులు ఉల్లి బాంబులా పేలుతుందని అప్పుడే వ్యంగ్యోక్తులు వినబడుతున్నాయి. బాగలకోటె, గదగ జిల్లాల నుంచి ఉల్లి మార్కెట్‌కు వస్తే ధర మరింత తగ్గవ చ్చని వ్యాపారులు చెబుతున్నారు. గదగలో బంపర్ క్రాప్ పండిందని విన వ చ్చిన ప్పటికీ, ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని చెబుతున్నారు.
అదే కనుక నిజమైతే కేజీ రూ.వంద దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మహారాష్ట్ర న ుంచి పంట వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. ఇప్పటికే వంటల్లో ఉల్లి వినియోగాన్ని చాలా వరకు తగ్గించేశారు. గతంలో కేజీలు లెక్కన తీసుకెళ్లే వారు ఇప్పుడు పావు కేజీ, అర కిలోతో సర్దుకు పోతున్నారు. ఉల్లితో బాగా ముడిపడి ఉండే వంటలను తగ్గించేశారు. గతంలో నగరంలోని మాంసాహార హోటళ్లలో అడగకున్నా పిడికెడు ఉల్లి పాయలు ఇచ్చే వారు. ఇప్పుడు అడిగినా వాటిని చూపించడం కూడా లేదు. ఉల్లి ధర పాత స్థాయికి వచ్చేంత వరకు ఇంతేనని హోటళ్ల యజమానులు తెలిపారు.