
బాక్సింగ్ శిక్షణలో ఎమి
సహజత్వం కోసం కొన్ని చిత్రాలకు హీరోలతో పాటు హీరోయిన్లు సాహసాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన శిక్షణ కూడా అవసరమవుతుంది. రుద్రమదేవి చిత్రం కోసం నటి అనుష్క కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యల్లో శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఎమి జాక్సన్ కూడా అదేబాటలో పయనిస్తున్నారు. ఐ చిత్రంలో అందాల ఆరబోతతో పాటు అభినయంతో శహభాష్ అనిపించుకున్న ఎమిజాక్సన్ ఇప్పుడు కల్సా నృత్యం, బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారట. ఈమె హిందీలో నటించిన తొలి చిత్రం ఏక్ దివానా తా నిరాశ పరిచింది.
చిన్న గ్యాప్ తీసుకుని అక్కడ మరో ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆమెకు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా అవకాశం కల్పించారు. అక్షయ్‌కుమార్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న కింగ్ ఈస్ బ్లింగ్ చిత్రంలో ఎమిజాక్సన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. దీనికోసం కల్సా నృత్యం, బాక్సింగ్‌లో శిక్షణ పొందాలని షరతులు విధించారట. ఈ మేరకు ఎమి ఆ రెండు కళల్లో కసరత్తు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే మొదట ఈ పాత్ర కోసం కీర్తి సనోన్‌ను ఎంపిక చేసుకున్నారటా. ఆ పాత్రకు ఆమె నప్పకపోవడంతో ఆ అదృష్టం ఎమిని వరించినట్టు సమాచారం.