పునరాలోచించండి
పునరాలోచించండి
Published Tue, Feb 11 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమక్షంలో జన్‌లోక్ పాల్ చట్టం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. ఇందులోభాగంగా ఈ నెల 16న ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు తంటాలుపడుతోంది. అయితే పోలీసుల అభ్యంతరాల దృష్ట్యా శాసనసభ వెలుపల సమావేశం నిర్వహించే యోచనను పునఃపరిశీలించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సూచించారు. సోమవారం తనను కలసిన కేజ్రీవాల్‌కు ఆయన ఈ సలహా ఇచ్చారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఢిల్లీ విధానసభ ప్రత్యేక సమావేశాలు ఆరంభం కానున్నాయి. 13న జన్‌లోక్‌పాలఃబిల్లుతోపాటు స్వరాజ్ బిల్లును కూడా ప్రవేశపెడతామని, స్వరాజ్ బిల్లును 15న అసెంబ్లీ ఆమోదిస్తుందని కేజ్రీవాల్ అంటున్నారు.
జన్‌లోక్ పాల్ బిల్లు ఆమోదంకోసం ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే అసెం బ్లీలో కాకుండా మరోచోట నిర్వహించాలనే యోచనను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ కార్యక లాపాలకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతో వచ్చే వ్యక్తులను గుర్తించి వేరుచేయడం వీలుకాదని పోలీసులు అంటున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్... కే జ్రీవాల్‌కు తెలిపారు. పోలీసుల అభ్యంతరాలతోపాటు భారీ సంఖ్యలో తరలివచ్చే ప్రజలను నియంత్రించడం కష్టమన్న విషయం జనతాద ర్బార్‌లో తేటతెల్లమైందని, శాసనసభ సమీపంలో ప్రజలను నియంత్రించడం మరింత కష్టమని లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు., అసెంబ్లీ కార్యకలాపాల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో అసెంబ్లీని సమావేశపరిచే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పునరాలోచించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సూచించారు.
జన్‌లోక్‌పాల్ బిల్లుపై రాజకీయం
ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులొడ్డి ప్రయత్నించడం, ప్రతిపక్షం సర్కారును కూలదోయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యంలో సాధార ణం. అయితే ఢిల్లీలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి కనిపిస్తోంది. జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందనట్లయితే తాను రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెదిరిస్తుండగా, ముఖ్యమంత్రిని రాజీనామా చేయనివ్వబోమని అసెంబ్లీలో ప్రతిపక్షనేత హర్షవర్ధన్ అంటున్నారు. జన్‌లోక్‌పాల్ చట్టంకోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధమని , లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందనట్లయితే రాజీనామా చేస్తానని, ప్రభుత్వం కూలడం ఖాయమని ముఖ్యమంత్రి అంటుండగా, తాము రాజీనామా సమర్పించి కేజ్రీవాల్‌ను పారిపోనివ్వబోమని హర్షవర్ధన్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టరూపం దాల్చకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అసెంబ్లీలో బిల్లుకు అడ్డమొస్తే రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
లోక్‌పాల్ బిల్లుపై ప్రతి చోటా ఆర్భాటం చేసే ముఖ్యమంత్రి ఇంతవరకు తమన ఎమ్మెల్యేలకు లోక్‌పాల్ బిల్లు కాపీని చూపించలేదని హర్షవర్ధన్ ఆరోపించారు. కేజ్రీవాల్ తన నాటకాన్ని తక్షణమే నిలిపివేయాలని, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో పారిపోనివ్వబోమని చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అవినీతి వ్యతిరేకపోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని హర్షవర్ధన్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటీవలే అధికారంలోకి వ చ్చిన దృష్ట్యా నెలన్నరలోనే ప్రభుత్వాన్ని కూల్చి అది కూడా అవినీతి నిరోధక బిల్లు విషయమంలో ప్రభుత్వాన్ని పడగొట్టామనే అపకీర్తితో ప్రజల ముందుకెళ్లడానికి బీజేపీ వెనుకాడుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నప్పటికీ మరోసారి అసెంబ్లీ ఎన్నికల భారాన్ని భుజానికెత్తుకోవడానికి అటు బీజేపీగానీ లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలుగానీ సిద్ధంగా లేరని తెలుస్తోంది.
Advertisement
Advertisement