డీఎన్‌డీ ఫ్లైవేను టోల్ ఫ్రీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
టోల్ వసూలు నిలిపివేయాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : డీఎన్‌డీ ఫ్లైవేను టోల్ ఫ్రీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫ్లైవేపై వాహనాల రాకపోకలను బుధవారం అడ్డుకున్నారు. దాదాపు 400 మంది బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగడంతో గంటకు పైగా ఫ్లైవేపై వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. టోల్ ఫీజు వసూలు చేయడం వల్ల ఇప్పటికే గణనీయంగా లాభాలను ఆర్జించించారని బీజేపీ నాయకులు చెప్పారు. అందువల్ల ఇకనైనా టోల్ వసూలు చేయడం ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఫ్లైవే ఢిల్లీని నోయిడాతో కలుపుతోంది. దీనిని నోయిడా టోల్ బ్రిడ్జ్ సంస్థ బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన నిర్వహిస్తోంది.