కేబుల్ కట్ !
Published Fri, Dec 13 2013 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
ప్రసారాలకుశ్రీకారం చుట్టింది. రూ.70 నెలసరి అద్దెతో 90 చానళ్లను అరసు కేబుల్ ద్వారా రాష్ట్రంలో అందిస్తూ వస్తున్నారు. అయితే, చెన్నైలో మాత్రం ఈ ప్రసారాలకు తరచూ అవాంతరాలు ఎదురవుతోన్నాయి.
తొలుత అనివార్య కారణాలు, ప్రస్తుతం కేంద్రం రూపంలో ఛానళ్ల ప్రసారాలకు బ్రేక్ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేబుల్ టీవీ ప్రసారాల్ని డిజిటల్‌మయం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఈ డిజిటలైజేషన్‌కు గత ఏడాది నవంబర్ వరకు గడువు ఇచ్చారు. అన్ని నగరాలు డిజిటల్‌మయం కాగా, చెన్నైలో మాత్రం ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా పరిస్థితి మారింది. డిజిటల్ అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నా, ఇంతవరకు అక్కడి నుంచి స్పందన లేదు. దీంతో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువు ముగిసినా సాధారణ టెక్నాలజీతోనే ప్రసారాల్ని అందిస్తూ వస్తున్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో, కేంద్రం అనుమతి ఇస్తుందో లేదోనన్న వేచి చూసే ధోరణిలో ఉన్న రాష్ట్ర కేబుల్ కార్పొరేషన్‌కు ట్రాయ్ షాక్ ఇచ్చింది.
గడువు ముగిసినా ఇంత వరకు అరసు కేబుల్ చెన్నైలో డిజిటల్‌మయం కాకపోవడంతో టెలికాం రెగులేటరీ అథారిటీ(ట్రాయ్) రంగంలోకి దిగింది. చెన్నైలోని అరసు కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో ట్రాక్ కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ రెండు రోజుల క్రితం భేటీ అయ్యారు. డిజిటల్‌మయం కాకపోవడానికి గల కారణాల్ని మాత్రం ట్రాయ్ పరిగణన లోకి తీసుకోకపోవడం గమనార్హం. డిజిటల్ మయం కానందున చానళ్ల ప్రసారాల్ని నిలుపుదల చేయాలన్న ఆదేశాలను ఇచ్చారు. కేబుల్ ప్రసారాల్ని నిలుపుదల చేయని పక్షంలో జరిమానా లేదా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికను రాజీవ్ జారీ చేయటంతో చెన్నైలో అరసు కేబుల్ ప్రసారాలప సందిగ్ధత నెలకొంది.
చెన్నైలో అరసు కేబుల్ ఛానల్ వినియోగదారులు అధిక సంఖ్యలో ఉన్నారు. కేబుల్ ప్రసారాలు ఆగిపోతాయన్న సమాచారంతో వారిలో ఆందోళన నెలకొంది. అయితే, ప్రసారాల నిలుపుదలకు ఆస్కారం లేదంటూ కేబుల్ కార్పొరేషన్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. డిజిటల్ మయం అనుమతిని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఇవ్వాల్సి ఉందని, వారు నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే పనులు ఆగాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమను చూపుతున్న కేంద్రం, తాజాగా కేబుల్ ప్రసారాలపై కన్నేసినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్‌మయం అనుమతి వ్యవహారం హైకోర్టులో ఉన్న దృష్ట్యా, ప్రసారాల్ని నిలుపుదల చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. డిజిటల్‌మయం పనులు పూర్తి చేసి ఉన్నామని, కేంద్రం అనుమతి రాగానే, సెట్ ఆఫ్ బాక్సుల్ని పంపిణీ చే యడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ అధికారి పేర్కొన్నారు. కేబుల్ ప్రసారాలు డిజిటల్‌మయం అనుమతి ఉత్తర్వుల్ని ఇచ్చిన పక్షంలో టీవీ ప్రసారాల బాధ్యతల్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు అవుతుంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉన్న దృష్ట్యా, ఈ అనుమతిని కేంద్రం ఇచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement