అత్యాచార బాధితురాలికే గాక, ఆ దారుణం వల్ల్ల జన్మించిన పిల్లలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
న్యూఢిల్లీ: అత్యాచార బాధితురాలికే గాక, ఆ దారుణం వల్ల్ల జన్మించిన పిల్లలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనార్టీ తీరని బాలికను సవతి తండ్రి అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అత్యాచారం కారణంగా జన్మించిన పిల్లలకు నష్టపరిహారం ఇవ్వాలన్న నిబంధనలేవీ చట్టంలోగాని, ఢిల్లీ ప్రభుత్వ నష్టపరిహారం పథకంలో గాని లేకపోవడం శోచనీయమని పేర్కొంది.