సాక్షి, న్యూఢిల్లీ : ఆప్ సర్కారు గృహావసరాలకు ప్రతి కుటుంబానికి రోజుకు 670 లీటర్ల నీటిని ఉచి తంగా ఇస్తామని ప్రకటించడంతో నగరవాసులంతా నీటిమీటర్లు బిగించుకునే పనిలో పడ్డారు. కొందరైతే ఇన్నాళ్లు వాడకుండా మూలనపడేసిన పాత మీటర్లను తీసి మరీ మరమ్మతులు చేసుకుంటున్నారు. గత సర్కారు ఏళ్లుగా ఎన్ని విధాలా ప్రయత్నించినా కనిపించని ఫలితం ఉచిత హామీతో కొన్నిరోజుల్లోనే వచ్చిందని జల్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా నీటి మీటర్లకోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారి ఒకరు తెలిపారు. రోజుకు వందకు పైగా దరఖాస్తులు అందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
వీటితోపాటు పాడైన మీటర్లను బాగు చేయాలంటూ జల్‌బోర్డు అధికారులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లలో నీటిమీటర్లు సక్రమంగా ఉన్నవారికే ఉచిత మంచినీటి హామీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రజల్లో శ్రద్ధ పెరుగుతోంది. ప్రస్తుతానికి నగరంలో నీటి మీటర్లు ఉన్నవారి సంఖ్య అధికారికంగా 8.56 వేలు మాత్ర మే. ఇదే రకంగా వినియోగదారులు మీటర్లు బిగిం చుకునేందుకు ముందుకు వస్తే మరికొన్ని వారాల్లోనే వీరి సంఖ్య 12 లక్షలకు మించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న లెక్క ప్రకారం మూడున్నర లక్షల మంది వినియోగదారుల నీటిమీటర్లు పాడైపోయాయి. సిటిజన్ ఫ్రంట్ ఫర్ వాటర్ డెమోక్రసీ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 3.51 లక్షల మంది వినియోగదారులు మీటర్లు లేని వారు,నీటిమీటర్లు పాడైనవారు ఉన్నట్టు పేర్కొంది.
కాగా ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఉచిత నీటి పంపిణీతో వేర్వేరు నీటి మీటర్లు పెట్టుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు బహుళ అంతస్థుల భవనాల్లోనూ ఒకే మీటర్‌పై నీటిని విని యోగించుకుంటున్నారు. అలాకాకుండా ప్రతి ఫ్లోర్ కి వేర్వేరు మీటర్లు బిగించుకోవడంతో ఉచిత నీటిని పొందే వీలు కలగనుంది. వీరితోపాటు ఉచితంగా నీటిని పొందాలనుకునే వారు నీటి దుబారాను తగ్గించుకోవచ్చు. కొత్తగా మీటర్లు అమర్చుకోవాలనుకునేవారు సొంతంగా మీటర్లు కొనుగోలు చేసుకోవచ్చని జల్‌బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జల్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో ఆయా కంపెనీల పేర్లు సైతం పొందుపర్చారు. ఆ కంపెనీల మీటర్లను కొనుగోలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఇబ్బందులు తలెత్తవని వారు పేర్కొంటున్నారు. నీటి మీటర్లు కొనుగోలు చేసుకున్న అనంతరం జల్‌బోర్డులోని అధికారిక ప్లంబర్లకు సమాచారం ఇస్తే వారు మీటర్లు బిగిస్తారని వెల్లడిస్తున్నారు.
నీటి మీటర్లకు గిరాకీ!
Published Tue, Jan 14 2014 12:33 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement