ఏఎస్సై మోహన్రెడ్డికి రిమాండ్ | district court remands to ASI mohan reddy | Sakshi
Sakshi News home page

ఏఎస్సై మోహన్రెడ్డికి రిమాండ్

Published Tue, Aug 23 2016 7:16 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

district court remands to ASI mohan reddy

కరీంనగర్ : అక్రమ వడ్డీ వ్యాపారి, ఏఎస్సై మోహన్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోమవారం ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆయన్ను.. పోలీసులు మంగళవారం జిల్లా కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి సెప్టెంబర్ 6 వరకు రిమాండ్ విధించారు. మోహన్రెడ్డిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.  నారాయణ రెడ్డి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

గ్యాంగ్‌స్టర్ నయీంతో ఏఎస్సై మోహన్రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, అందుకు సంబంధించి ఆధారాలను తమకు సమర్పించిన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement