శిశువుతో దంపతులు కృష్ణన్, సెందమిళ్ సెల్వి, పక్కన డాక్టర్ సెందామరై సెల్వి
టీ.నగర్: పళని బాలాజి ఫర్టిలిటీ సెంటర్ 63 ఏళ్ల మహిళకు టెస్ట్‌ట్యూబ్ చికిత్స ద్వారా సంతాన ప్రాప్తిని కలిగించి రికార్డు సాధించింది. ఈ సందర్భంగా నగరంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సెంటర్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సెందామరై సెల్వి, చికిత్సలందుకున్న మహిళ సెందమిళ్ సెల్వి, ఆమె భర్త కృష్ణన్ పాల్గొన్నారు. డాక్టర్ సెందామరై సెల్వి మాట్లాడుతూ ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయంకు చెందిన వారు సెందమిళ్ సెల్వి (63), కృష్ణన్ (71). వీరికి వివాహమై సుమారు 42 ఏళ్లయినా సంతానం కలగలేదు.
అనేక ఆస్పత్రులకు తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరిగా ఈ ఆస్పత్రికి రెండేళ్ల క్రితం వాచ్చారన్నారు. ఆమెకు మెనోపాజ్ నిలిచిపోయి 10 ఏళ్లయినా.. పరీక్షలు నిర్వహించి గర్భధారణ సామర్థ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమె ఆధునిక టెస్ట్‌ట్యూబ్ బేబీ చికిత్స ద్వారా గర్భం దాల్చడంతో నిరంతరం పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఆమె ఇటీవల 3.25 కిలోల బరువైన ఆడశిశువుకు జన్మనిచ్చిందన్నారు. సెందమిళ్ సెల్వి,, కృష్ణన్ దంపతులు డాక్టర్ సెందామరై సెల్వికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment