సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదు.. ఫేస్‌బుక్ చూడరాదు
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
తన చావుకు భర్తే కారణమంటూ సూసైడ్ నోట్
మైసూరు: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శనివారం నరగంలోని భైరవేశ్వర నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు..పిరియా పట్టణ తాలూకా మల్లహళ్లి గ్రామానికి చెందిన కావ్య(26)కు మూడు సంవత్సరాల క్రితం నగరానికి చెందిన ప్రసాద్‌తో వివాహమైంది. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న ప్రసాద్.. వివాహమైన ఏడాదినుంచి భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఎవరితోనూ మాట్లాడరాదని, ఫేస్‌బుక్ చూడకూడదని, ఫోన్‌లో కూడా ఎవరితోనూ మాట్లాడకూడదంటూ చిత్రహింసలకు గురి చేసేవాడు.భర్త ప్రవర్తనతో జీవితంపై విరక్తి చెందిన కావ్య శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు భర్త అనుమానపు వేధింపులే కారణమంటూ మృతురాలు రాసిన సూసైడ్‌నోట్ పోలీసులు స్వాధీనం చేసుకొని ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ప్రసాద్ సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కుమార్తె తమ వద్ద విలపించేదని తల్లిదండ్రులు పోలీసుల వద్ద వాపోయారు. తన కుమార్తె మృతి కారణమైన ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.