అర కోటి దాటిన బీజేపీ సభ్యత్వాలు | Half crore Crossing BJP Memberships | Sakshi
Sakshi News home page

అర కోటి దాటిన బీజేపీ సభ్యత్వాలు

Published Sat, Feb 14 2015 12:07 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

అర కోటి దాటిన బీజేపీ సభ్యత్వాలు - Sakshi

అర కోటి దాటిన బీజేపీ సభ్యత్వాలు

ట్వీట్ చేసిన అమిత్ షా... రాష్ట్ర శాఖకు అభినందనలు
ముంబై: రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా బీజేపీ సభ్యత్వం ఇచ్చినట్లు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ శాఖను అభినందిస్తూ ట్వీట్ చేశారు. గత నవంబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ మొదటి సభ్యత్వం తీసుకుని... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన 10 కోట్ల బీజేపీ సభ్యత్వాల్లో ఇప్పటికే 5 కోట్లు నమోదయ్యాయి.

ప్రపంచంలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సభ్యత్వ నమోదు గురించి ప్రచారం చేస్తూ బీజేపీ చీఫ్, ఇతర నేతలు దేశమంతా తిరుగుతున్నారు. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement