గుంటూరు జిల్లాలో వర్ష బీభత్సం
Published Tue, Sep 13 2016 11:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
-గురజాలలో కొట్టుకుపోయిన రైల్వేట్రాక్
-నీటమునిగిన పలు గ్రామాలు
గుంటూరు: భారీ వర్షాలతో గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలోని గురజాల మండలంలో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని దండి వాగు ఉధృతికి మాచర్ల- గుంటూరు రైల్వే ట్రాక్ కొట్టుకు పోయింది. మాచర్ల నుంచి గుంటూరు వెళ్లే పలు రైళ్లను నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురజాల పట్టణంలో వరద ధాటికి పలు ఇళ్లు నీటమునిగాయి. పల్నాడులో వరద బీభత్సం సృష్టించింది. పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దుర్గిలో అత్యధికంగా 27.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మాచర్లలోని పలు వార్డుల్లో ఇళ్లలోకి వరద నీరు రావడంతో నానా ఇక్కట్లు పడుతున్నారు. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రహహిస్తోంది. రెంటచింతల , గోళి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement